వేసవిలో ఆరోగ్యం అనగానే తీసుకునే ఆహారం, తాగే నీళ్ల గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కానీ దానితో పాటు పీల్చే గాలి మీద కూడా శ్రద్ధ పెట్టాలంటున్నారు వైద్య నిపుణులు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, వేసవిలో మరింత త్వరగా వ్యాపిస్తాయి అంటున్నారు.
వేసవి గాలితో జాగ్రత
వేసవిలో ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా వేగంగా ఒంట్లోకి ప్రవేశిస్తుంది. శరీరంలో ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ పీల్చుకునే గాలి నుండే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి. అక్కడి నుంచి రక్తంలోకి చేరుకొని హిమోగ్లోబిన్ తో జతకట్టి అన్నికణాలకు చేరుతుంది. అందుకే గాలిలో తీవ్రమైన దుమ్ము, దూళి, కాలుష్యం చేరినప్పుడు ముక్కు నుంచి గుండె వరకు ఎన్నో నరాల సమస్యలు వస్తాయి. పైగా మనదేశంలో ఎక్కువ కాలుష్యం కలిగిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. కాబట్టి మరింత జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ధూళి కణాల ఎఫెక్ట్: గాలిలో ఉండే దుమ్ము, కలుషిత రసాయనాలతో వెంటనే కలిసిపోతుంది. సిటీలో కాలుష్యం వల్ల ఏర్పడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ , బెంజీన్, లాంటివి గాలిలోని దుమ్ము ధూళితో కలిసిపోయి చిన్న చిన్న కణాల్లా ఏర్పడతాయి. ఈ ధూళి కణాలు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. పది మైక్రాన్ల కంటే ఎక్కువ సైజు ఉండే కణాలు కింద పడిపోతాయి. కానీ రెండు నుంచి పది మైక్రాన్లలోపు ఉండేవి మాత్రం గాల్లో అలా తేలియాడుతూ ఉంటాయి. ఇవి మనం శ్వాస తీసుకున్నప్పుడు, ముక్కు శ్వాసనాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తులోకి వెళ్లి పలు సమస్యలకు దారితీస్తాయి.
సమస్యలు ఇవే..
ఎండాకాలం గాలి ప్రభావం వల్ల కళ్ల మంటలు, దురద, నీరు రావటం వంటివి తెలెత్తవచ్చు. వేడి గాలిలోని దుమ్ము ధూళి. ముక్కులో ప్రవేశించినప్పుడు ముక్కులో అలర్జీ పుడుతుంది. దాని వల్ల మంట, నీరు కారటం, దురద వంటివి మొదలవుతాయి. కొంతమందిలో సైనసైటిస్ ప్రాబ్లమ్ కూడా రావొచ్చు.ఇక ఇంకో ముఖ్యమైన సమస్య ఆస్తమా.. దుమ్ము వాహనాల నుంచి వెలువడే రసాయనాలు శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు, శ్వాసనాళాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం కుచించుకుపోతుంది. ఇది ఆస్తమాకు దారితీస్తుంది. దీనివల్ల దగ్గు, ఛాతిలో బరువుగా ఉండటం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇక ఆస్తమా ఉన్న పేషెంట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండాకాలం మరింత సమస్యగా మారుతుంది.
►ALSO READ | బ్రేక్ ఫాస్ట్ లో సూపర్ ఫుడ్స్.. ఉదయాన్నే తింటే రోజంతా ఎనర్జీ!
సిఓపిడీ (క్రానిక్ అబ్స్ట్రక్ట్రివ్ పల్మనరీ డిసీజ్) గుండె మన శరీరానికి శక్తి కోసం అక్సిజన్ ను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫ్రీరాడికల్స్ విడుదలవుతుంటాయి. వీటిని యాంటీ అక్సిడెంట్లు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటమో. ఒంట్లోంచి బయటకు పంపించడమో చేస్తుంటాయి. అయితే. కొందరిలో ఈ ప్రక్రియ దెబ్బతిని వాపుకు దారి తీస్తుంది. దీంతో సీఓపీడీ వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు కూడా తలెత్తవచ్చు.
పిల్లలపై కూడా..
చిన్నపిల్లలో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ది చెందవు. వీరిలో రోగనిరోధకశక్తి కూడా తక్కువే. అందువల్ల పెద్దల కన్నా పిల్లలపై ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే సిటీలోని పిల్లలో 20 శాతం ఎక్కువ మంది ఆస్తమాతో బాధపడుతున్నారని కొన్ని సర్వేల్లో తేలింది.
గుండెకు కూడా..
కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ కన్నా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువమొత్తంలో శరీరంలోకి వెళ్తుంది. ఇదిహిమోగ్లోబిన్ తో ఇతర కార్బాక్సీహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీంతో గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి గుండెపోటు రావొచ్చు. వాయు కాలుష్యంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా మారిపోతున్నట్లు, ఇది గుండె రక్తనాళాల పనితీరును మార్చేస్తు స్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. మెదడుకు రక్తసరఫరా చేసే నాళాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడితే పక్షవాతం రావొచ్చు.
ఏం చేయాలి...
- వేసవిలో బయటకు వెళ్లినప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవటం తప్పనిసరి. వీలైతే నాసల్ పిల్లర్లు ధరించటం ఇంకా ఉత్తమం.
- కాలుష్య వాతావరణంలో గడిపితే పొగతాగినట్లే లెక్క అందువల్ల ట్రాఫిక్ ఎక్కువగా తిరిగే వాళ్లు పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
- శ్వాస ద్వారా వచ్చే సమస్యలు కేవలం బయటకు మాత్రమే కాదు ఇంట్లోవాడుకునే వస్తువుల నుంచి కూడా వస్తాయి. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
- దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి. దులిపితే వాటిపై ఉండే దుమ్ము గాలిలో కలుస్తుంది. కాబట్టి ఏవస్తువునైనా తడిగుడ్డతో తుడుచుకోవటం మంచిది.
- వంటింట్లోంచి పొగ బయటకు వెళ్లేలా ఫ్యాన్లు, చిమ్మీల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. వంటచెరకు కిరోసన్ కు బదులు గ్యాస్ వాడుకోవాలి .
- మస్కిటో కాయిల్స్ కు బదులు దోమతెరలు వాడుకోవటం ఉత్తమం.
- మన శరీరానికి అవసరమైన 80 శాతం శక్తి ఆక్సి-జన్ నుంచే లభిస్తుంది. కాబట్టి దుమ్ము, ధూళి ద్వారా ఆక్సిజన్ నదిగా అందకపోతే అలసట వస్తుంది. నిస్సత్తువ, చిరాకు వంటివి వస్తాయి. కొందరిలో ఇది ఒత్తిడికి సైతం దారితీయొచ్చు.
- రోజూ ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాస ప్రక్రియను శుద్ధి చేసుకోవచ్చు
