అథ్లెటిక్స్లో సునందకు మూడు గోల్డ్ మెడల్స్..అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత  

అథ్లెటిక్స్లో సునందకు మూడు గోల్డ్ మెడల్స్..అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత  

హైదరాబాద్​ సిటీ, వెలుగు : నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. మహిళల 400 మీటర్లు, 800 మీటర్ల రన్నింగ్, రిలే పోటీల్లో ఆమె ఈ ప్రతిభ చాటారు. దీంతో ఆమె ఈ నెల17 నుంచి 20వ తేదీ వరకు థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు మన దేశం తరఫున అర్హత సాధించారు. 

భర్త ప్రోత్సాహంతో.. 

సునంద భారతికి వివాహమైనా పట్టుదలతో తను అనుకున్న లక్ష్యం వైపు సాగిపోతున్నారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్యే శిక్షణ పొందుతూ ఆమె మూడు గోల్డ్​మెడల్స్​సాధించడంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన భర్త వేమనారాయణ రెడ్డి ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే తను ఈ స్థాయికి చేరేదాన్ని కాదని సునంద భారతి అన్నారు.