
పినపాక, వెలుగు: వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్‌కు చెందిన గర్భిణి జ్యోతికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు మంచానికి డోలి కట్టి 2 కి.మీ. దూరంలో ఉన్న భూపతిరావుపేట వరకు మోసుకెళ్లారు. అక్కడినుంచి 108 వాహనంలో జానంపేట పీహెచ్‌సీకి తరలించారు.
మూడు దశాబ్దాల క్రితం చత్తీస్గఢ్నుంచి వలస వచ్చిన ఆదివాసీలు సుందరయ్యనగర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డోలి తిప్పలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.