IPL 2024: బెంగళూరు వన్ డైమెన్షనల్ వ్యూహం నిరాశపర్చింది: గవాస్కర్

IPL 2024: బెంగళూరు వన్ డైమెన్షనల్ వ్యూహం నిరాశపర్చింది: గవాస్కర్

ఐపీఎల్ 17వ సీజన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి చెందిన తీరు తనను నిరాశపర్చిందన్నారు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.  షార్ట్ బంతులను ఉపయోగించాలనే వ్యూహ్యాన్ని RCB అనుసరించిందని.. కానీ వారి,  బౌలింగ్ విధానంలో వైవిధ్యం లేకపోవడం మూళ్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.

షార్ట్ బాల్‌ను అన్ని విధాలుగా ప్రయత్నించండి..  కానీ, అది పని చేయనప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపించిందన్నారు.  జోసెఫ్, గ్రీన్, సిరాజ్, అందరూ షార్ట్ బంతులే వేశారని చెప్పారు. వారికి డాగర్ లాంటి వ్యక్తి ఉన్నాడని..  అతను 2 ఓవర్లు బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతనికి అవకాశం ఇవ్వాల్సిందన్నారు. బౌన్సర్‌ను సరిగా వేయకపోతే వైడ్ వెళ్తుందని..అంటే అదనపు పరుగు ఇస్తున్నారని.. దాంతోపాటు అదనపు డెలివరీని బౌల్ చేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి, మీ బౌన్సర్ చాలా ఖచ్చితమైనదిగా ఉండాలని ఆయన సూచించారు. ఆ వన్ డైమెన్షనల్ వ్యూహం నిజంగా నిరాశపరిచిందని గవాస్కర్ అన్నారు.

కాగా, శుక్రవారం జరిగిన ఐపిఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు ఓడిన సంగతి తెలిసిందే. తొలిత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్లకు 173 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై.. 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన 174 పరగులు చేసింది.