RCB vs KKR: కోహ్లీ, గంభీర్‌ ఆస్కార్‌కు అర్హులు: గవాస్కర్

RCB vs KKR: కోహ్లీ, గంభీర్‌ ఆస్కార్‌కు అర్హులు: గవాస్కర్

శుక్రవారం (మార్చి 29) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. డ్రింక్స్ విరామంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తమ విభేదాలను పక్కన పెట్టి  ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సీన్ కామెంటేటర్స్ రవిశాస్త్రి, భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం   సునీల్ గవాస్కర్ సరదాగా వ్యాఖ్యానించారు. 

మొదట రవిశాస్త్రి కోహ్లి, గంభీర్ మధ్య జరిగిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుతూ.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫెయిర్ ప్లే అవార్డుకు ఇవ్వాలని గవాస్కర్ తో అన్నాడు. దీనికి సునీల్ గవాస్కర్ గంభీర్, కోహ్లీ ఇద్దరూ.. కేవలం ఫెయిర్ ప్లే అవార్డుకు మాత్రమే కాదు ఆస్కార్ అవార్డు కు అర్హులు అని బదులిచ్చాడు. 2023 సీజన్ లో వీరిద్దరూ మధ్య ఎంత వార్ జరిగిందో తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరిని క్రికెట్ నుంచి సస్పెండ్ చేయాలని గవాస్కర్ అన్నాడు. అయితే ఈ సీజన్ లో వీరిద్దరూ తమ ఈగోలను పక్కన పెట్టి ఒకటవ్వడంతో ప్రశంసల వర్షం కురిపించాడు.  

2023 సీజన్ లో లక్నో, బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్‌ అయిపోయాక  ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ, నవీన్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది.  ఆ తర్వాత కైల్‌ మేయర్స్‌, విరాట్‌ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్‌ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు.ఈ సమయంలో గంభీర్ మళ్లీ ఏదో అనడంతో కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2013 ఐపీఎల్ లో కోహ్లీ, గంభీర్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో గొడవ జరిగింది.  

Also Read:ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో రింకూ సింగ్.. కోహ్లీ ఏం చేశాడంటే..?

ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. ఓపెనర్ నరైన్, వెంకటేష్ అయ్యర్ మెరుపులకు తోడు శ్రేయాస్ అయ్యర్, ఫిలిప్ సాల్ట్ సహకరించడంతో కేకేఆర్ విజయం సాధించి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.