DC vs SRH: మిరాకిల్ జరిగితేనే ప్లే ఆఫ్స్: సన్ రైజర్స్ టాప్- 4 కు రావాలంటే ఇలా జరగాలి!

DC vs SRH: మిరాకిల్ జరిగితేనే ప్లే ఆఫ్స్: సన్ రైజర్స్ టాప్- 4 కు రావాలంటే ఇలా జరగాలి!

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. ఏదైనా అద్బుతంగా జరిగితే తప్ప హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం దాదాపు అసాధ్యం. పది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఏడింటిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయాలని ఆశిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం(మే 5) ఉప్పల్ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనుంది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వాలంటే ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం. 

సన్ రైజర్స్ 10 మ్యాచ్ ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9 స్థానంలో ఉంది. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మొదట ఈ నాలుగు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ భారీ విజయం సాధించాలి. అదే సమయంలో కోల్ కతా ఒక మ్యాచ్ లో ఓడిపోవాలి. ఇక ముంబై లేదా గుజరాత్ తాము ఆడబోయే మిగిలిన అన్ని మ్యాచ్ లు ఓడిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ తాము ఆడబోయే చివరి మ్యాచ్ ల్లో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు. 

సన్ రైజర్స్ మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిచినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16), పంజాబ్ కింగ్స్ (15) కంటే వెనకే ఉంటుంది. మంగళవారం (మే 6) గుజరాత్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా 16 పాయింట్లు సాధిస్తుంది. ఈసీజన్ లో ఎలా చూసుకున్నా సన్ రైజర్స్ టాప్ -3 లో ఉండే అవకాశం కనిపించడం లేదు. నాలుగో స్థానం ఆరాటపడుతున్న సన్ రైజర్స్ కు తాము ఆడబోయే నాలుగు మ్యాచ్ లు గెలవడంతో పాటు మిగిలిన మ్యాచ్ ల ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. ఒకవేళ నేడు జరగబోయే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.