SRH గెలవాలంటే.. టాసే కీలకం..?

SRH గెలవాలంటే.. టాసే కీలకం..?

పుణే: ఈ సీజన్ ఐపీఎల్ లో టాస్ ఎంతో కీలంగా మారిందంటున్నారు స్పోర్ట్ ఎనలిస్టులు. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమ్సే గెలిచాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లోనూ టాస్ ఎంతో కీలకం అంటున్నారు. గత సీజన్లో చెత్త పెర్ఫామెన్స్ తో ఢీలా పడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–15 కోసం రెడీ అయ్యింది. ఇవాళ పుణే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో తొలి లీగ్ మ్యాచ్ లో పోటీపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న హైదరాబాద్    .. మెగా వేలంలోనూ పెద్ద ఆటగాళ్లపై దృష్టి పెట్టలేదు. గ్లెన్ ఫిలిప్స్ ఓపెనర్ గా వచ్చే చాన్స్ ఉంది. మిడిలార్డర్ లో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి కీలకం కానున్నారు. గత లీగ్స్ లో త్రిపాఠి రాణించినా.. నిలకడలేమి అతడి సమస్యగా మారింది. విలియమ్సన్     మూడో నంబర్ లో బ్యాటింగ్ కు వస్తే, రవికుమార్ సమర్థ్.. ఓపెనర్ గా ఆడే అవకాశం ఉంది. అబ్దుల్ సమద్ ను ఫినిషర్ గా వాడే ఛాన్స్ ఉంది. బౌలింగ్ లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ పేస్ భారాన్ని మోయనున్నాడు. యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా రాణిస్తే సన్ కు తిరుగుండదు. యార్కర్ స్పెషలిస్ట్ టి. నటరాజన్ పై అందరి దృష్టి ఉంది. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్ , సుచిత్ ను ట్రై చేసే అవకాశం ఉంది.

మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రతి ఏడాది ఒకటి, రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినా.. టైటిల్ గెలవాలంటే తను మరింత ఎక్కువగా శ్రమించాలి. ఈ ఐపీఎల్ లో రాణిస్తే శాంసన్ కు.. టీమిండియా ప్లేస్ కూడా సుస్థిరం అవుతుంది. ఇక రాజస్థాన్ టీమ్ లో మ్యాచ్  విన్నర్స్ కు కొదువలేదు. జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ ఓపెనర్లుగా రావొచ్చు. పవర్ హిట్టర్ షిమ్రన్ హెట్ మయర్, డుసెన్, నీషమ్, రియాన్ పరాగ్    .. మిడిలార్డర్ లో ఆడనున్నారు. రాజస్థాన్ బౌలింగ్ కు తిరుగులేదు. అశ్విన్, చాహల్ స్పిన్     బాధ్యతలు మోయనున్నారు. ట్రెంట్ బౌల్ట్ , ప్రసిధ్ కృష్ణ, సైనీతో పేస్ బలం కూడా పెరిగింది.

 

హరీశ్ ట్వీట్: తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు