హరీశ్ ట్వీట్: తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి

హరీశ్ ట్వీట్:  తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై TRS , కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ధాన్యం విషయంలో BJP, TRS తమ నైతిక బాధ్యతను మరిచిపోయారని ట్వీట్ చేశారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. రైతుల శ్రమతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో పండిన చివరి గింజా కొనేవరకు రైతుల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

రాహుల్ గాంధీ ట్వీట్ పై TRS నేతలు స్పందించారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ మేలు కోరుకుంటే.. ఎంపీలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలన సూచించారు. ఓకే దేశం.. ఒకే సేకరణపై కాంగ్రెస్ తీరేంటని ప్రశ్నించారు. రైతుల విషయంలో రాజకీయాలు చేసి పరువు తీసుకోవద్దని ట్వీట్ చేశారు. మరోవైపు రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలిపడం కరెక్ట్ కాదని రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలపండని... విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. 

మరోవైపు TRS ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయట్లేదని.. సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారని కవిత్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. FCIకి ఇకపై బాయిల్డ్ రైస్ అమ్మబోమని 2021 అగస్టులో ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేశారని గుర్తుచేశారు. రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయాన్ని మర్చిపోయారా అని... కవితకు ఘాటుగా రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి. అటు తెలంగాణ రైతుల కోసం గళమెత్తిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రభుత్వం చేయాల్సింది.. పార్లమెంటు వెల్ లో డ్రామాలు కాదు.. ధాన్యం కొనుగోళ్లు అని కవితకు కౌంటర్ ఇచ్చారు. స్వార్థ రాజకీయం కోసం పేదరైతుని బలిపెట్టకండని ట్వీట్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు మాని, ప్రతిపల్లెలో ఐకేపీ కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరించాలని సూచించారు దాసోజు శ్రవణ్.