సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు
  • కరీంనగర్​ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ 

కరీంనగర్​టౌన్, వెలుగు: రైతులు ప్రణాళికబద్ధంగా పంటలు వేసుకొని లాభాలు పొందాలని కరీంనగర్​కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ​సూచించారు.  సోమవారం  స్థానిక జడ్పీ హాల్​లో నిర్వహించిన ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి పరిశోధన, విస్తరణ సలహా సంఘ  సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంటలపై  శాస్త్రవేత్తల కంటే రైతులకే బాగా తెలుసని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో  సాగు విస్తీర్ణం పెరిగిందని ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్​పెట్టి,  గిట్టుబాటు ధర,  మార్కెట్​లో   డిమాండ్ ఉన్న పంటలు వేస్తే లాభాలు పొందొచ్చని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్  వర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్​ ప్రొ. జగదీశ్వర్ మాట్లాడుతూ కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ పరిశోధన జగిత్యాల అసోసియేట్ డైరెక్టర్ డా. ఉమాదేవి వ్యవసాయ పరిశోధనలో సాధించిన ప్రగతిని పీపీపీ ద్వారా వివరించారు.