వడదెబ్బతో  ఉపాధి కూలీ మృతి..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఘటన

వడదెబ్బతో  ఉపాధి కూలీ మృతి..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఘటన

కోనరావుపేట, వెలుగు : వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పులి రవి (38) రోజు మాదిరిగానే గురువారం సైతం ఉపాధి పనులకు వెళ్లాడు.

పని పూర్తి కాగానే ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో వడదెబ్బకు గురై కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు.

రవికి భార్య నిర్మల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌‌‌‌ మల్యాల స్వామిదాసు, సింగిల్‌‌‌‌ విండో మాజీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ అనుపాటి భూంరెడ్డి, మాజీ భారతి కోరారు.