ఈ రోజుల్లో జనాలు ప్రతి విషయంలో కూడా లేటెస్ట్ స్టైల్ కోసం పాకులాడుతున్నారు. అది తిండైనా.. బట్టైనా సరే.. ఎక్కడైనా కొత్త రకమైన ఫుడ్ లభిస్తుందంటే చాలు.. జనాలు అక్కడ వాలిపోతున్నారు. అయితే అది లేటెస్ట్గా హెల్డీ ఉంటే .. మరి ఆ ఫుడ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి బ్రేక్ ఫాస్ట్ మూంగ్ దాల్ ఇడ్లీని ఇంట్లోనే అదిరిపోయే టేస్ట్ తో ఎలా తయారు చేయాలి.. ఏఏ పదార్ధాలు కావాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
మూంగ్ దాల్ ఇడ్లీ తయారీకి కావాల్సినవి
- పెసరపప్పు: ఒక కప్పు
- పెరుగు: పావు కప్పు
- అల్లం: చిన్న ముక్క
- పచ్చిమిర్చి: రెండు
- కరివేపాకు, కొత్తిమీర: కొంచెం
- క్యారెట్స్ తరుగు: ముప్పావు కప్పు
- ఇంగువ, ఆవాలు
- పసుపు, బేకింగ్ సోడా: ఒక్కోటి చిటికెడు
- ఉప్పు, నూనె, నీళ్లు: సరిపడా
మూంగ్ దాల్ ఇడ్లీ తయారీ విధానం
ఇడ్లీ పిండి తయారీ కోసం నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, పెరుగు, కరివేపాకు, ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కాసేపు పక్కన ఉంచాలి.
పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు, పసుపు వేయాలి. ఆ తాలింపును పిండిలో వేసి కలపాలి. క్యారెట్ తరుగు, కొత్తిమీర,బేకింగ్ సోడా కూడా వేసి కలపాలి.
ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి పిండి వేసి పాత్రలో పెట్టి మూతపెట్టాలి. దాదాపు పావుగంటసేపు ఉడికిస్తే సరి.
ఇక అంతే అదిరిపోయే టేస్ట్‌తో మూంగ్ దాల్ ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ రడీ..! దీనిని పల్లీ చట్నీ.. టమాటా చట్నీ.. అల్లం చట్నీతో తింటారు. ఏమీ లేకుండా కూడా తినవచ్చు.
