
గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఏకపక్ష మెజారిటి సాధించింది. ఆ పార్టీ అధినేత జగన్ కు పలు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల తన ట్విట్టర్ ద్వారా జగన్ కు అభినందనలు తెలిపారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడి తిరిగి అధికారంలోకి రావడం పట్ల ప్రధానికి శుభాకాంక్షలు తెలిపాడు మహేష్.
‘ఏపీలో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ గారికి శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం సరికొత్త ఎత్తుకు చేరుకోవాలనీ, మీ పదవీకాలం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. అలాగే కేంద్రంలో మరోసారి మోడీ పాలనలో భారత్ సుస్థిరతవైపు దూసుకుపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు