విజయ కృష్ణ నిలయంలోనే కృష్ణ పార్ధివదేహం

విజయ కృష్ణ నిలయంలోనే   కృష్ణ పార్ధివదేహం

అభిమానుల సందర్శనార్థం మంగళవారం రాత్రి విజయ కృష్ణ నిలయంలోనే సూపర్ స్టార్ కృష్ణ పార్ధివదేహాన్ని ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఆ తరువాత మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని  కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే  గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. చివరి నిమిషంలో ఇంట్లోనే పార్ధివదేహం ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 

మధ్యాహ్నం అంతిమయాత్ర
బుధవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు.  ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.