అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ తమకు 10 చమురు నౌకలను బహుమతిగా ఇచ్చినట్లు ప్రకటించారు. ఇరాన్, అమెరికాతో జరుగుతున్న బ్యాక్‌చానల్ లో జరుగుతున్న చర్చల్లో సీరియస్‌నెస్ చూపించడానికి పది ఆయిల్ ట్యాంకర్లను గిఫ్ట్‌గా పంపించిందని ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఒకవైపు తీవ్రమైన యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని గంటల ముందే అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినా.. అంతకు మించిన వేగంతో దాడి చేస్తామని మరోవైపు ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ తమకు ఆయిలో బోట్లను గిఫ్ట్ గా ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
►ALSO READ | అబుదాబిపై ఇరాన్ మిసైళ్ల దాడి.. శకలాలు పడి భారతీయుడి మృతి
చర్చలకు సంబంధించి తమ సీరియస్‌నెస్ చూపించడానికి, చిత్తశుద్ధిని నిరూపించడానికి... మీకు ఎనిమిది పెద్ద ఆయిల్ బోట్లను అనుమతిస్తామని ఇరాన్ చెప్పింది అంటూ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో చమురుతో వెళ్తున్న ఎనిమిది ట్యాంకర్లను ఇరాన్ అనుమతించింది. తర్వాత మరో రెండు బోట్లను అదనంగా పంపించి మొత్తం పది బోట్లను ఇచ్చిందని అన్నారు.
ట్యాంకర్లన్నీ పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్నవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఈ రెండు అదనపు బోట్లను పంపించినట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో అమెరికా సరైన మధ్యవర్తులతో మాట్లాడుతోందని ఇది నిరూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెప్పి నేను మీ నెగోషియేషన్స్‌ను పాడు చేయలేదు కదా?.. అని జోక్ చేశారు.
