గాంధీ దవాఖానకు మందులు, అత్యవసరాల నిలిపివేత

గాంధీ దవాఖానకు మందులు, అత్యవసరాల నిలిపివేత
  • రూ. 17 కోట్ల పెండింగ్​ బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్ణయం
  • ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రకటన 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానకు అవసరమైన మందులు, సర్జరీకి అవసరమైన డిస్పోజబుల్స్‌‌‌‌‌‌‌‌, డయాగ్నస్టిక్ కిట్లు, వివిధ ఇంప్లాంట్లను నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ దవాఖాన సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌కు లెటర్​రాసింది. 2022 నుంచి గాంధీ దవాఖానకు డ్రగ్స్, సర్జికల్ డిస్పోజబుల్స్‌‌‌‌‌‌‌‌, ఆర్థోపెడిక్, న్యూరో, కార్డియాలజీ ఇంప్లాంట్లు, డయాగ్నస్టిక్ కిట్లు సరఫరా చేస్తున్నామని, అయితే దీనికి సంబంధించిన రూ.10 కోట్ల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి ఆరోగ్యశ్రీ కింద ఉన్న రూ.ఏడు కోట్ల బకాయిలు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

మొత్తం కలిపి 17 సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి, డీఎంఈ, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈఓ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదన్నారు. బకాయిలు అధికంగా పేరుకుపోవడంతో తాము కూడా బయట కొని ఇవ్వడం కష్టంగా మారిందన్నారు. దీంతో బుధవారం నుంచి గాంధీ దవాఖానకు సరఫరాను ఆపేశామని అసోసియేషన్ ప్రెసిడెంట్​రామచంద్ర ప్రకటించారు.