న్యూఢిల్లీ: సమ్మర్ వెకేషన్‌ను సుప్రీం కోర్టు ఐదు వారాల పాటు వాయిదా వేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి జూలై 5 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. ఈ క్రమంలో వెకేషన్‌ను రీషెడ్యూల్ చేస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 19 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ విచారణకే పరిమితమైన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తాజాగాఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం సెలవుల వాయిదా నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) స్వాగతించింది. ఈ సంక్షోభ సమయంలో పేద ప్రజలకు సాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీబీఏ ప్రెసిడెంట్ దుషాంత్ దేవ్ సుప్రీం కోర్టును కోరారు.
