పెల్లెట్ గన్స్ ఎప్పుడు పేల్చాలి.. విధివిధానాలు ఏంటీ : కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు

పెల్లెట్ గన్స్ ఎప్పుడు పేల్చాలి.. విధివిధానాలు ఏంటీ : కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర.. నీట్ పేపర్ లీక్ పై స్టూడెంట్స్ చేపట్టిన నిరసనలపై పెల్లెట్లు పేల్చటంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెల్లెట్ గన్స్ నిషేధం కోరుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ పై పిల్లెట్లు పేల్చటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయ స్థానం. 

పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించి విధివిధానాలు ఏంటీ.. ఎలాంటి సమయంలో పెల్లెట్లు పేల్చుతారు.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక రూపంలో అందించాలని కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. 

అసాధారణమైన పరిస్థితులు, సందర్భాల్లో మాత్రమే పెల్లెట్ గన్స్ ప్రయోగించాలనే నిబంధనలు ఉన్నా.. అందుకు విరుద్ధంగా.. మన దేశ యువతపైనే పెల్లెట్ గన్స్ ఉపయోగించారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటీషనర్లు. గుంపులపై ప్రయోగించామని పోలీసులు చెబుతున్నారని.. ఆ గుంపు స్టూడెంట్స్ అని.. వాళ్లేమీ తీవ్రవాదులు.. ఉగ్రవాదులు కాదని పిటీషనర్లు కోర్టులో వాదనలు వినిపించారు. 

పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నివేదిక తర్వాత ఈ పిటీషన్లపై పూర్తి విచారణ చేస్తామని స్పష్టం చేసింది.