నోరు అదుపులో పెట్టుకో రాహుల్ ..రఫేల్ డీల్ పై సుప్రీం గ్రీన్ సిగ్నల్

నోరు అదుపులో పెట్టుకో రాహుల్ ..రఫేల్ డీల్ పై సుప్రీం గ్రీన్ సిగ్నల్

రఫేల్ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. యూపీఏ హయాంలో 36 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయని, సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు  పిటిషన్  దాఖలు చేశారు. ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తుతూ ఒప్పందం లో పారదర్శకత లేదని, వివరాల్ని ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ..కేసును పలు దఫాలుగా వాయిదా వేస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలో గురువారం రఫెల్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్ పిటిషన్లను కొట్టిపారేసింది. రఫెల్ డీల్ పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రఫెల్ డీల్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా ఒప్పందం జరిగిందని సూచించింది.

రాజ్ నాధ్ నేతృత్వంలో గతంలో కంటే ఆధునాతన యుద్ధ విమానాల్ని భారత్ కొనుగోలు చేస్తుందని, సాంకేతిక నైపుణ్యం, యుద్ధ నైపుణ్యంలో  అనేక మార్పులు చేసినట్లు, కాబట్టే ఖర్చు అదనంగా పెరిగినట్లు ప్రభుత్వం తరుపు న్యాయవాది తుషార్ మెహత వాదనల్ని వినిపించారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు, మెహత వాదనాల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం రఫెల్ పై సీబీఐ విచారణ అవసరం లేదని జస్టిస్ రంజన్ గొగొయ్ కూడిన ధర్మాసన  ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో రఫెల్ కుంభకోణం అంటూ మోడీపై కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోని విడుదల చేసింది. “నేను దేశానికి చౌకీదార్” అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్  “చౌకీదార్ చోర్ హై” అంటూ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ వీడియోను నిలిపివేయాలని ఆదేశించింది.

బీజేపీ ఎంపీ మీనాక్షి లెఖీ కోర్ట్ ధిక్కార పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేశారు. రఫేల్  విషయంలో ప్రధాని నరేంద్రమోడీని చౌకిదార్ చోర్ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారని, ప్రధానిపై ఆయన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదే  అంశాన్ని ప్రస్థావించిన సుప్రీం..రాహుల్ గాంధీ పై  నమోదైన కోర్ట్ దిక్కారణ కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చింది. రాహుల్ గాంధీ మరోసారి నోరు జారొద్దని సుప్రీం ధర్మాసనం సూచించింది.