
న్యూఢిల్లీ: తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటే తాను కూడా అదే బాటలో నడుస్తానని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు. ఐపీఎల్–14లో సీఎస్‌కే విజయం సాధిస్తే.. మరో సీజన్ ఆడే విధంగా ధోనీని ఒప్పిస్తానన్నాడు. ‘మహీ భాయ్ వచ్చే సీజన్ ఆడకపోతే నేను కూడా ఆడను. 2008 నుంచి మేము సీఎస్‌కేకు ఆడుతున్నాం. ఈ ఏడాది మేము గెలిస్తే.. వచ్చే ఏడాది కూడా ఆడేలా ధోనీని నేను ఒప్పిస్తా. నేను మరో నాలుగైదేళ్లు ఆడగలను. వచ్చే ఏడాది లీగ్‌లో రెండు కొత్త టీమ్స్ కూడా చేరుతాయి. కానీ నేను చివరిదాకా సీఎస్‌కేతోనే ఉంటానని అనుకుంటున్నా’ అని రైనా పేర్కొన్నాడు.