
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ దరఖాస్తుల గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8500కు పైగా దరఖాస్తులు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేస్తోంది.
భూ భారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్‌ను పొందుపర్చింది. ఇక అర్హత పొందిన అభ్యర్థుల్లో 5 వేల మందిని లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా ఎంపిక చేయనున్నారు. వారికి సర్వేపై శిక్షణ ఇచ్చిన అనంతరం విధుల్లో చేరనున్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు సర్వేలు నిర్వహించి, రిజిస్ట్రేషన్‌కు ముందు స్కెచ్ తయారుచేసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. వీరి పనులను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి ఆమోదిస్తారు.