
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని నలుగురు మహిళలు చనిపోయారు. స్థానికంగా చామకూరి అనిల్ అనే వ్యక్తి పండుగ చేస్తుండటంతో…. పుట్ట బంగారం తెచ్చేందుకు సమీప ప్రాంతానికి మేళతాళాలతో వెళ్లారు బంధువులు. పుట్టబంగారం తీసుకుని వస్తుండగా.. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి మహిళలపై దూసుకువెళ్లింది. ప్రమాదంలో గరిడేపల్లికి చెందిన మర్రి వెంకమ్మ, మర్రి ధనమ్మ, బేతవోలు గ్రామానికి చెందిన మట్టమ్మ, మరో 19 ఏళ్ల యువతి చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో… హుజూర్ నగర్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోవటంతో.. పండుగ జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.