రియా..! క్లాస్ట్రోఫోబియా అంటే ఇదేనా

రియా..! క్లాస్ట్రోఫోబియా అంటే ఇదేనా

దివంగ‌త బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కు విమానాలంటే భ‌య‌మా..? అయితే ఈ వీడియో చూడండి అంటూ సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ట్వీట్ చేశారు.

సుశాంత్ మ‌ర‌ణంపై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తామిద్దరం యూర‌ప్ ట్రిప్ లో ఉన్న‌ప్పుడు క్లాస్ట్రోఫోబియా బాధ‌ప‌డుతున్నట్లు సుశాంత్ త‌న‌తో చెప్పిన‌ట్లు రియా తెలిపింది. ఫ్లైట్ జ‌ర్నీలో క్లాస్ట్రోఫోబియా ఉంద‌ని, అందుకే సుశాంత్ మెడాఫినిల్ అనే మందులు తీసుకున్నట్టు వెల్ల‌డించింది. అంతేకాదు ప్లైట్ జ‌ర్నీచేసే ప్ర‌తీసారి బోర్డింగ్ లో ఎలాంటి ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా ఆ మందుల్ని తీసుకున్న‌ట్లు తెలిపింది.

అయితే రియా వ్యాఖ్య‌ల్ని సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఖండించారు. సుశాంత్‌కు అలాంటి వ్యాధులేవీ లేవని, అవన్నీ అసత్యాలని అన్నారు.

2018లో సుశాంత్ బోయింగ్ 737 బేస్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ అనంత‌రం నా 150క‌ల‌ల్లో ఒక క‌ల నెర‌వేరింది. ల‌వింగ్ మై డ్రీమ్ అంటూ ఫ్లైట్ ట్రైనింగ్ వీడియోను ట్వీట్ చేశారు.

2019 మార్చిలో సుశాంత్ ఓ విమానాన్ని ఎలా డ్రైవ్ చేయాలో ట్రైనింగ్ తీసుకున్న వీడియోను ట్వీట్ చేశాడు. అయితే ట్రైనింగ్ స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన వీడియో ను ట్వీట్ చేస్తూ మీరు ఆనందంగా ఉండండి. మీ మ‌న‌సు మాట వినండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ వీడియోనే అంకిత లోఖండే సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. రియా ఇదేనా క్లాస్ట్రోఫోబియా అంటే..? సుశాంత్ నీవు ఎప్పుడూ ఆకాశంలో ఎగరాలనుకున్నావు. నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుందంటూ అంకిత ట్వీట్ లో ప్ర‌స్తావించారు.