తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్

తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్

సుష్వాస్వరాజ్ విలువలకు కట్టుబడి జీవించారు : బండి సంజయ్

హైదరాబాద్: సుష్మాస్వరాజ్ తెలంగాణ చిన్నమ్న అని కొనియాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుష్మాస్వరాజ్ 70వ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... సుష్మాస్వరాజ్ గొప్ప నాయకురాలని, ఆమె లేని లోటు పూడ్చలేనిదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, యువకులు తమ ప్రాణాలు తీసుకొవద్దని, బతికుండి సాధించుకుందామని భరోసానిచ్చారన్నారు. సుష్మాస్వారాజ్ జీవితాంతం తాను నమ్మిన విలువలకు కట్టుబడి జీవించాన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బాలీవుడ్ హిట్ నెంబర్కు స్టెప్పులేసిన సంజయ్, మాధురీ

‘రాధేశ్యామ్’ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది