మాజీ కేంద్ర మంత్రి, బహిష్కృత నేత ఆర్కే సింగ్బీజేపీపై ఎదురుదాడికి దిగారు. తనను పార్టీ నుంచి సస్సెండ్ చేయడం తీవ్రంగా స్పందించారు. సస్పెండ్ చేశారు సరే గానీ.. ఎందుకు చేశారో చెప్పనేలేదు అని అంటూ బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు.
నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వొద్ద అనడం తప్పా.. అవినీతికి పాల్పడిన వారికి టికెట్లు ఇవ్వొద్దు అనం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని .. ఇటువంటి చర్యలు పార్టీకి, పార్టీ ప్రతిష్టకు, ప్రయోజనాలకు హాని కలిగించవా అని ప్రశ్నించారు.
2025 బిహార్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, నాయకత్వ ప్రవర్తనపై ఆర్కే సింగ్తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆర్కే సింగ్ బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అనంత్ సింగ్‌లకు ఎలా సీటు ఇచ్చారని బహిరంంగానే ఆర్కే సింగ్ బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికల లాభం కోసం పార్టీ నేతలు నైతికతను కోల్పోతున్నారని ఆరోపించారు. ఇది పార్టీపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆర్కేసింగ్ వాదించారు.
క్రిమినల్స్ పార్టీలో ఉండటం ప్రజలకు ఇష్టం లేదు..ప్రజల ఇష్టానికి విరుద్ధంగా నేను పనిచేయలేదు.. పార్టీ ప్రయోజనాల కోసమే ప్రశ్నించాను.. పార్టీకి వ్యతిరేకం కాదు అంటూ ఆర్కే సింగ్ చెప్పారు.
मैंने पार्टी को अपना त्यागपत्र भेज दिया है। मेरे द्वारा प्रदेश कार्यालय को भेजे गए पत्र तथा माननीय राष्ट्रीय अध्यक्ष भाजपा को भेजा गया त्यागपत्र सलंग्न है। pic.twitter.com/jmP8Qw17JA
— R. K. Singh (@RajKSinghIndia) November 15, 2025
ఎన్నికల ముగిసి కొద్ది సేపటికే ఆర్కే సింగ్ పై బీజేపీ సస్పెన్సన్ వేటు వేసింది. ఎన్నికల్లో అంతర్గత అసమ్మతి పెరుగుతున్న క్రమంలో ఎన్డీయే అధికారం దక్కించుకుంది. పార్టీ నాయకత్వం, ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా ఆర్కే సింగ్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ బీహార్ నాయకత్వానికి , ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి.
