సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​లో వ్యక్తి అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​లో వ్యక్తి అనుమానాస్పద మృతి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 36 ఏండ్ల గుర్తు తెలియని వ్యక్తిని తొలుత సెక్యూరిటీ సిబ్బంది గమనించి, హాస్పిటల్​లో అడ్మిట్ చేయించారు. అయితే, సదరు వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం మృతి చెందాడు. డెడ్​బాడీని మార్చురీలో భద్రపరిచినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పీఎస్​ లో సంప్రదించాలని కోరారు.