సువేందు అనునేను..పశ్చిమబెంగాల్ సీఎంగా.. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

సువేందు అనునేను..పశ్చిమబెంగాల్ సీఎంగా.. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం, మే9, 2026 న  ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతాలలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో  జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సువేందు అధికారి చేత గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి  అమిత్  షాతో ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నేతలు, పశ్చిమ బెంగాల్  బీజేపీ నేతలు హాజరయ్యారు.  పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని, మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెర లేపింది. 

సువెందు అధికారి రాజకీయ ప్రస్థానం..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువెందు అధికారి అనూహ్యంగా ఎదిగారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న  ఆయన ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2021 ఎన్నికలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్ పోటీలో మమతా బెనర్జీని ఓడించడం ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. అప్పటి నుంచి  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రచారంలో కీలక ముఖాల్లో ఒకరిగా ఉన్నారు  సువేందు అధికారి.  206 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకపాత్ర పోషించారు.