జీహెచ్ఎంసీకు ఎస్ బీ ఐ స్వచ్ఛ ఆటోలు

జీహెచ్ఎంసీకు ఎస్ బీ ఐ  స్వచ్ఛ ఆటోలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీకి స్టేట్​బ్యాంక్ ఆఫ్​ఇండియా (ఎస్బీఐ)10 మహీంద్రా జీయో ఈవీ వాహనాలను(స్వచ్ఛ ఆటో టిప్పర్లను) అందజేసింది. ఎస్బీఐ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రూ.కోటి నిధులతో మంగళవారం కోఠిలోని ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ రాధాకృష్ణన్ వీటిని అందజేశారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. సీఎస్ఆర్ కింద ఎస్బీఐ ఈ వాహనాలను అందజేసినట్లు తెలిపారు. 

నగర ప్రజలకు   మరిన్నిసేవలు అందించదానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మిగతా సంస్థలు కూడా జీహెచ్ఎంసీ  సహకారం అందించాలని కోరారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్లు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఉన్నారు.