మక్కలకు మద్దతు ధర ఇచ్చుడు కుదరదు

మక్కలకు మద్దతు ధర ఇచ్చుడు కుదరదు

మక్కలకు మద్దతు ధర ఇచ్చుడు కుదరదని సీఎం కేసీఆర్ తేల్చేశారు. అయినా రైతులు మక్కల్ని పండిస్తే సర్కార్ బాధ్యత లేదని స్పష్టం చేశారు. ఎంత రేటు వచ్చినా ఫర్వాలేదనుకునేటోళ్లే పండించుకోవచ్చన్నారు. యాసింగీలో మక్క పంట వేస్తే  ప్రభాత్వానికి బాధ్యత కాదని స్పష్టం చేశారు. మక్కలను పౌల్ట్రీ వ్యాపారులు కూడా కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కవ ధరకే కోళ్ల దాణా దొరుకుతుందన్నారు. మక్క రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు పౌల్టీ వ్యాపారులతో మాట్లాడినా కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు సీఎం కేసీఆర్.

కేసీఆర్ స్టేట్ మెంట్ తో మద్ధతు ధరేమో కాని..మక్క రైతులు నిండా మునిగే ప్రమాదం వచ్చింది. పౌల్టీ వ్యాపారులకు కేసీఆర్ సర్కార్ ప్రకటన మరింత కలిసొచ్చేలా ఉంది. తక్కువ రేటుతో కొనేందుకు పౌల్టీ వ్యాపారులు కాచుక్కూచున్నారు. మరోవైపు మక్కలకు మద్దతు ధర ఇవ్వకపోవడానికి కేంద్రమే కారణమంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మక్కల దిగుమతికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, దేశంలో మక్కల స్టాక్ పెరిగిపోయిందని, అందుకే రేటు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు సీఎం.