ఫైనల్లో సిమెట్రిక్స్‌‌‌‌‌‌‌‌, టైగర్స్‌‌‌‌‌‌‌‌

ఫైనల్లో సిమెట్రిక్స్‌‌‌‌‌‌‌‌, టైగర్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : టీ9 గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సిమెట్రిక్స్‌‌‌‌‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ బౌల్డర్‌‌‌‌‌‌‌‌ హిల్స్‌‌‌‌‌‌‌‌ టైగర్స్‌‌‌‌‌‌‌‌ జట్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లాయి. బుధవారం బౌల్డర్‌‌‌‌‌‌‌‌ హిట్స్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌, కౌంటీ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సెమీఫైనల్లో సిమెట్రిక్స్‌‌‌‌‌‌‌‌ 2.5-–1.5తో జాగృతి జాగ్వార్స్‌‌‌‌‌‌‌‌ జట్టును ఓడించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బౌల్డర్‌‌‌‌‌‌‌‌ హిల్స్ టైగర్స్‌‌‌‌‌‌‌‌ 3–1తో ఎకోలాస్టిక్‌‌‌‌‌‌‌‌ ఈగల్స్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. శనివారం రెండు రౌండ్లలో జరిగే ఫైన్లలో బౌల్డర్‌‌‌‌‌‌‌‌ హిల్స్‌‌‌‌‌‌‌‌ టైగర్స్‌‌‌‌‌‌‌‌, సిమెట్రిక్స్‌‌‌‌‌‌‌‌ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. మూడో స్థానం ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ పోరులో ఈగల్స్‌‌‌‌‌‌‌‌, జాగృతి జాగ్వార్స్‌‌‌‌‌‌‌‌ తలపడుతాయి.