అమెరికా వెళ్లిన వృద్ధురాలు.. 3 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లిన దొంగలు.. సైనిక్ పురిలో ఘటన

అమెరికా వెళ్లిన వృద్ధురాలు.. 3 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లిన దొంగలు.. సైనిక్ పురిలో ఘటన

మల్కాజిగిరి, వెలుగు: అమెరికా వెళ్లిన వృద్ధురాలి ఇంట్లో 3 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. సైనిక్​పురిలోని హస్నాపూర్ కాలనీకి చెందిన సీహెచ్ విజయలక్ష్మి (68) గత ఫిబ్రవరి 11న అమెరికాలో ఉన్న తన పిల్లల వద్దకు వెళ్లగా, శనివారం ఉదయం ఇంట్లో పనిచేసే యశోదమ్మ వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. 

బెడ్​రూమ్​లోపలికి వెళ్లి పరిశీలించగా, అల్మారా తాళాలు కూడా పగులగొట్టి ఉన్నాయి. కాగా, అల్మారాలో 3 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు, రూ.5 వేల నగదు ఉన్నట్లు అమెరికాలోని బాధితురాలు పేర్కొన్నారు. అవి కన్పించకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.