T-20 Try serices : పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఆఫ్గాన్ షాక్‌‌‌‌‌‌‌‌ ..18 రన్స్ తేడాతో గెలుపు

T-20 Try serices   : పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఆఫ్గాన్ షాక్‌‌‌‌‌‌‌‌ ..18 రన్స్ తేడాతో గెలుపు

షార్జా: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌  ముంగిట ఆఫ్గానిస్తాన్ అదరగొట్టింది. టీ20 ట్రై సిరీస్‌‌‌‌‌‌‌‌లో బలమైన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గాన్ 18 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అఫ్గాన్ ఇబ్రహీం జద్రాన్ (45 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో65), సెదీఖుల్లా అటల్ (45 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) ఫిఫ్టీలతో నిర్ణీత 20 ఓవర్లలో 169/5 స్కోరు చేసింది. 

పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ (4/27) నాలుగు వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ ఓవర్లన్నీ ఆడి 151/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. పదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ హారిస్ రవూఫ్‌‌‌‌‌‌‌‌ (34 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. తనతో పాటు ఫఖర్ జమాన్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (20) మాత్రమే కాస్త పోరాడారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌‌‌‌‌‌‌‌, నబీ, రషీద్ ఖాన్‌‌‌‌‌‌‌‌, ఫజల్‌‌‌‌‌‌‌‌హాక్‌‌‌‌‌‌‌‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇబ్రహీం జర్దాన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.