న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, అహ్మదాబాద్ ఇందులో ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే ఈ మెగా ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. లక్షకు పైగా సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం కావడం విశేషం.
వచ్చే వారం మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరిగే చాన్స్ ఉంది. పాకిస్తాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికగా శ్రీలంకలోని మూడు వేదికలను ఖరారు చేశారు. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్ లంకలో జరుగుతుంది.
