కరోనాతో సహజీవనం చేయాల్సిందే

కరోనాతో సహజీవనం చేయాల్సిందే

హైదరాబాద్: వైద్యసేవలకు గాంధీ హాస్పిటల్ కేంద్రం కాబోతోందన్నారు మంత్రి ఈటల రాజేందర్. గాంధీలో 35 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలు  కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోకి  కరోనా వైరస్ వచ్చి ఏడాది  పూర్తయిన సందర్భంగా  గాంధీలో కరోనా వారియర్స్ ను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి తలసానితో కలిసి పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ 365 రోజుల్లో హెల్త్ సిబ్బంది సేవ గుర్తు చేసుకుంటే …కన్నీళ్లు వస్తున్నాయన్నారు  మంత్రి ఈటల.

గాంధీ హాస్పిటల్ కోసం తన ప్రాణం పెట్టానన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్ కట్టించాలని ప్రాణం కంటే ఎక్కువ కొట్లాడాని అన్నారు. ప్రజలు, ప్రభుత్వం భయపడుతున్న టైంలో హెల్త్ సిబ్బంది చేసిన సేవను చరిత్ర  మరిచిపోదన్నారు తలసాని. ప్రభుత్వాసు పత్రుల్లో గతంలో చెడ్డపేరు ఉండేదని..కరోనా సమయంలో సేవలు అందించి గాంధీ హాస్పిటల్ కు మంచి పేరు తెచ్చారన్నారు. పేదలకు గాంధీ హాస్పిటల్ వరంగా మారిందన్న తలసాని..ఇతర వైరస్ ల లాగే కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని తెలిపారు మంత్రి తలసాని.