అందుకే వారికి హుజూర్ నగర్ లో ప్రజలు బుద్ధి చెప్పారు

అందుకే వారికి హుజూర్ నగర్ లో ప్రజలు బుద్ధి చెప్పారు

హుజూర్ నగర్ బైపోల్ ఎన్నికల్లో 30 వేలు వస్తుందనకున్న మెజారిటీ 43 వేలు దాటిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా డిండిలో మంత్రి తలసాని పర్యటించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ దిండిలో చేపలమార్కెట్ ఏర్పాటు చేసి మత్సకారులకు ఉపాధికల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా ఇస్తానంటే ఎవరైనా వద్దన్నారా అని అడిగారు. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకొని కేసీఆర్ ను, కేసిఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని, అందుకే వారికి హుజూర్ నగర్ లో ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలు సర్పంచులకే చెక్ పవర్ ఇవ్వాలని అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉప సర్పంచ్ గ్రామస్థుడు కాదా?  ఆయన్ను గ్రామస్థులు గెలిపించలేదా?  అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.