హైదరాబాద్ కుస్తీకి పూర్వ వైభవం తెస్తం : తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ కుస్తీకి పూర్వ వైభవం తెస్తం : తలసాని శ్రీనివాస్ యాదవ్

కోఠి, వెలుగు: ఎంతో మంది కుస్తీ వీరులను హైదరాబాద్ అందించిందని, అంతర్జాతీయ స్థాయి చాంపియన్లను తయారు చేసిన ఘనత నగరానికి ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్​లో గురువారం అండర్-17 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్​షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. సరైన సౌకర్యాలు లేక యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారన్నారు.

కుస్తీ పోటీలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రత్యేక ప్రణాళికతో కుస్తీ ఆటకు పాత రోజులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షుడు సంతోష్ పెహల్వాన్ పాల్గొన్నారు.