పుచ్చకాయపై మంత్రి వివేక్ ముఖచిత్రం

 పుచ్చకాయపై మంత్రి వివేక్ ముఖచిత్రం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: పుచ్చకాయపై మంత్రి వివేక్ వెంకటస్వామి బొమ్మ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్. కేవలం 30 నిమిషాల్లో పుచ్చకాయపై వివేక్ వెంకటస్వామి ముఖచిత్రాన్ని రూపొందించాడు. 

అనిల్ తనకు ఇష్టమైన నాయకుల చిత్రపటాలను సందర్భానుసారంగా పుచ్చకాయపై వేస్తూ తన కార్వింగ్ కళను చాటుకుంటున్నాడు. గురువారం వివేక్ వెంకటస్వామి బొమ్మను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులకు అందజేశారు.