
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద రూ.5 కోట్లతో నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ పుట్ ఓవర్ బ్రిడ్జి కు రెండు వైపులా లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, 8 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. బల్దియా పరిధిలో ఇప్పటివరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో 22 బ్రిడ్జిల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. తొందరలోనే వాటిని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.