సుప్రీం తీర్పుని బట్టి ముందుకెళ్తాం

V6 Velugu Posted on Sep 14, 2021

జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  కొందరు కోర్టుకు వెళ్లడంతో.. హైకోర్ట్ నిమజ్జనంపై తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్ళినట్లు తెలిపారు మంత్రి. రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. సుప్రీం తీర్పుని బట్టి ముందుకు వెళ్తామన్నారు తలసాని. వినాయక నిమజ్జనం,ఏర్పాట్లపై భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీతో సమావేశమై చర్చించారు. నిమజ్జనంపై వారికి పలు సూచనలు చేశారు మంత్రి

Tagged Talsani Srinivas Yadav, supreme court, Vinayaka immersion, Utsav Committee, verdict

Latest Videos

Subscribe Now

More News