తమిళ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర.. స్టార్ హీరోలకు లైఫ్

తమిళ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర.. స్టార్ హీరోలకు లైఫ్

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..  చెన్నైలోని మియాట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబర్  28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 

నిజానికి.. తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్రలో చాలా మందికి సహాయం అందించారు విజయకాంత్. ఎవరికీ ఏ సమస్య వచ్చినా తానే ముందుండి చూసుకునేవారు. కేవలం తన సినిమాలే కాదు.. వేరే హీరోల సినిమాల్లో నటించి వారికి మంచి గుర్తింపు వెచ్చేలా చేశారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న తలపతి విజయ్, సూర్యలకు తన సినిమాల్లో అవకాశం ఇచ్చి వారికి గుర్తింపు వచ్చేలా చేశారు విజయకాంత్. అలా ఇండస్ట్రీలో బ్రేక్ కోసం కష్టపడుతున్న చాలా మంది హీరోల సినిమాల్లో నటిస్తూ.. వాళ్లను నిలబెట్టిన నటుడిగా గుర్తింపు పొందారు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా సినిమాలు చేసిన విజయకాంత్.. వాటిలో కూడా వేరే హీరోలకు అవకాశాలు కల్పించి.. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. అందుకే ఆయన్ని తమిళ ఇండస్ట్రీకి పెద్దన్న భావిస్తారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడంతో.. ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.