
‘బీస్ట్’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిన విజయ్, ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ‘వారసుడు’ అనే టైటిల్‌ను తెలుగులో ఫిక్స్ చేశారట. అదే అర్థం వచ్చేలా తమిళంలో ‘వారిసు’ అనే పేరును ఫైనల్ చేసినట్టు టాక్. విజయ్ బర్త్‌డే సందర్భంగా జూన్ 22న ఈ టైటిల్‌ను రివీల్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడు ఫస్ట్ హాఫ్‌లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో నటించనున్నాడు విజయ్. ఇటీవల డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ తీసి విజయాన్ని అందుకున్న లోకేష్, విజయ్ సినిమాను గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించబోతున్నాడట. ఓ మలయాళ స్టార్‌ను ఇందులో కీలకపాత్రకు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.