నీట్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం 

నీట్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం 

చెన్నై: జాతీయ స్థాయిలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ చేసిన తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సందర్భంగా ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ తీర్మానం ప్రవేశపెట్టింది డీఎంకే ప్రభుత్వం. ఈ తీర్మానాన్ని అన్ని పక్షాల సభ్యులు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సీఎం స్టాలిన్ కోరారు. 
మద్దతిస్తున్నామంటూనే వాకౌట్ చేసిన అన్నాడీఎంకే
నీట్ కు వ్యతిరేకంగా డీఎంకే ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. అయితే నీట్ పరీక్ష వాయిదా పడుతుందని లేదా రద్దు చేస్తారనే ఉద్దేశంతో చాలా మంది పరీక్షకు ప్రిపేర్ కాలేకపోయారని, అందుకే నిన్న పరీక్ష సందర్భంగా ఒత్తిడిని భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబించి ఉంటే ఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.