సీఏఏపై తీర్మానం చేసిన తమిళనాడు అసెంబ్లీ

సీఏఏపై తీర్మానం చేసిన తమిళనాడు అసెంబ్లీ

చెన్నై: సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ) ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇవాళ అసెంబ్లీలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సీఏఏ దేశ ఐక్యతకు, మత సామరస్యానికి విఘాతం కల్గిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సెక్యూలర్‌ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధంగా ఉందని స్టాలిన్‌ అన్నారు. 
స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చను అడ్డుకున్న బీజేపీ, అన్నా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీలో పూర్తి  మెజారిటీ ఉన్నందున అధికార డీఎంకే  సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది.