శంషాబాద్కు తమిళనాడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు

శంషాబాద్కు తమిళనాడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు

గండిపేట, వెలుగు: తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్​కు చేరుకున్నారు. శనివారం శంషాబాద్​లోని నోవాటెల్ హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఐదుగురు ఎమ్మెల్యేల కోసం పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం సద్దుమణిగే వరకు వీరంతా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. ‘క్యాంప్ రాజకీయాల’ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ప్రలోభాలు ఉండకూడదనే ముందు జాగ్రత్తగా హైకమాండ్​వీరిని హైదరాబాద్​కు తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు నోవాటెల్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.