తమిళనాడులో విజయ్ విజిల్.. 107 సీట్లలో టీవీకే విజయ కేతనం

తమిళనాడులో విజయ్ విజిల్.. 107 సీట్లలో టీవీకే విజయ కేతనం
  • 234 సీట్లకు 107 సీట్లలో టీవీకే విజయ కేతనం
  • పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే సింగిల్‌‌‌‌ లార్జెస్ట్​ పార్టీగా అవతరణ
  • అధికార పీఠానికి అడుగు దూరం.. హంగ్ ప్రభుత్వం?
  • ఇతర పార్టీల మద్దతుతో సీఎంగా విజయ్?
  • రెండు చోట్ల బంపర్​ మెజార్టీతో గెలిచిన దళపతి
  • ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఫస్ట్​ అటెంప్ట్‌‌‌‌లోనే గెలిచిన పార్టీగా టీవీకే రికార్డు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 234 సీట్లకుగానూ 108 చోట్ల గెలుపొంది.. అధికార పీఠానికి అడుగుదూరంలో నిలిచింది. ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌ తర్వాత సినీ నటుడు విజయ్​నేతృత్వంలోని ఈ పార్టీ.. పెట్టిన రెండేండ్లలోనే సింగిల్‌‌‌‌ లార్జెస్ట్​ పార్టీగా అవతరించి ద్రవిడ రాజకీయాల్లోనే  సరికొత్త చరిత్రను సృష్టించింది. ఎగ్జిట్​పోల్స్‌‌‌‌ను తలకిందులు చేస్తూ.. ఎన్నికల విశ్లేషకులే ఆశ్చర్యపోయేలా విజయ్​దళపతి ప్రభంజనం సృష్టించారు. ఆయన పోటీచేసిన రెండుచోట్ల గెలిచి..రీల్‌‌‌‌ లైఫ్​హీరో నుంచి రియల్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ లైఫ్ హీరోగా మారిపోయారు.  ప్రజలతో ‘విజిల్‌‌‌‌’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌‌‌‌లోనూ బంపర్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌ కొట్టారు. టీవీకే ధాటికి దశాబ్దాల సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే రెండో, మూడో స్థానానికి పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు.. సెంటిమెంట్​ రాజకీయాలు తమను గెలిపిస్తాయని నమ్మిన అధికార డీఎంకే డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ను మూటగట్టుకోగా.. కొళత్తూర్‌‌‌‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్  పరాజయం పాలయ్యారు.  దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను పక్కకు నెట్టి, నటుడు విజయ్ తొలి ఎన్నికలతోనే కింగ్‌‌‌‌మేకర్‌‌‌‌గా మారడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నది.

మొదటి రౌండ్‌‌‌‌ నుంచీ ఆధిక్యంలోనే టీవీకే..

రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలైంది. పోస్టల్​ బ్యాలెట్లనుంచే టీవీకే పార్టీ తన ఆధిక్యాన్ని ప్రారంభించింది. రౌండ్​ రౌండ్​కూ టీవీకే అభ్యర్థుల హవానే కొనసాగింది. మొత్తం 234 స్థానాలకు 107 స్థానాల్లో విజయం సాధించి టీవీకే చరిత్ర సృష్టించగా.. అధికార డీఎంకే 60 సీట్లు, అన్నా డీఎంకే 47 సీట్లతో సరిపెట్టుకున్నాయి. కాంగ్రెస్​ 5 చోట్ల, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 4, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌‌‌‌) 2, సీపీఐ 2 చోట్ల, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.  కాగా, దశాబ్దాలుగా డీఎంకేకు అండగా ఉన్న చెన్నై నగరాన్ని టీవీకే  క్లీన్ స్వీప్ చేసింది. అన్నా నగర్, ఎగ్మూర్, విల్లివాక్కంలాంటి కీలక స్థానాలను విజయ్ పార్టీ కైవసం చేసుకున్నది. 

రెండు చోట్ల విజయ్‌‌‌‌ గెలుపు..

టీవీకే అధినేత విజయ్‌‌‌‌ పోటీచేసిన రెండు చోట్ల విజయం సాధించారు. పెరంబూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఆర్‌‌‌‌‌‌‌‌డీ శేఖర్‌‌‌‌‌‌‌‌పై 53,715 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  ఇక్కడ విజయ్‌‌‌‌కి లక్షా 20 వేల 365 ఓట్లు రాగా.. ఆర్‌‌‌‌‌‌‌‌డీ శేఖర్‌‌‌‌‌‌‌‌కు 66,650 ఓట్లు వచ్చాయి. ఇక తిరుచిరాపల్లి ఈస్ట్‌‌‌‌ నియోజకవర్గంలో డీఎంకే నేత ఎస్. ఇనిగో ఇరుదయరాజ్‌‌‌‌పై 27,416 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ విజయ్‌‌‌‌కి 91,381 ఓట్లు వచ్చాయి. కాగా, తమిళనాడు రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా.. సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట అయిన కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.  టీవీకే అభ్యర్థి వీఎస్‌‌‌‌ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అన్నాడీఎంకే చీఫ్‌‌‌‌ ఈ పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో మరోసారి విజయం సాధించారు. టీవీకే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి ప్రేమకుమార్‌‌‌‌‌‌‌‌పై 98,110 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. టీవీకే చీఫ్‌‌‌‌ విజయ్ వ్యక్తిగత డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్.. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి 27,086 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తమిళ రాజకీయాల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, రోయపురం నియోజకవర్గంలో టీవీకే తరఫున పోటీచేసిన ఆటో డ్రైవర్‌‌‌‌ కె.విజయ్‌‌‌‌ ధాము శక్తిమంతమైన రాజకీయ వారసత్వం కలిగిన వ్యక్తులనే ఓడించి అద్భుత విజయం సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యే అయిన డాక్టర్‌‌‌‌‌‌‌‌ జయకుమార్‌‌‌‌ (అన్నాడీఎంకే), మాజీ మంత్రి రెహ్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కొడుకు సుబైర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను ఓడించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. విజయ్‌‌‌‌ ధాముకు మొత్తంగా 59,091 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థిపై 14,249 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.

హంగ్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌?

తమిళనాడు ఓటర్లు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇస్తుంటారు. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. ప్రస్తుతం విజయ్ పార్టీ (టీవీకే) అతిపెద్ద పార్టీగా (107 సీట్లు) అవతరించినప్ప టికీ, మ్యాజిక్ ఫిగర్‌‌‌‌కు మరో 11  సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే, డీఎండీకే లాంటి పార్టీల మద్దతు కూడగడితే విజయ్ సుల భంగా మెజారిటీ సాధించవచ్చు.  అయి తే, చిన్న చిన్న పార్టీలను కలుపుకొని వెళ్లే బదులు.. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అన్నా డీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్నీ తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.