తాండూరు, వెలుగు: తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న నీరజాబాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ సమావేశం జరిగింది. రూ. 27.51 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ మున్సిపల్ వనరుల ద్వారా రూ. 14 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. మున్సిపల్ గ్రాంట్స్‌తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నిధులు సమకూర్చుకుని తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. మిషన్ భగీరథ నీటిని వార్డుల్లోని ప్రతి ప్రాంతానికి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు
పాల్గొన్నారు.
