
గతంలో కూడా ఈసీ మెంబర్‌గా పనిచేశానని నటుడు తనీశ్ అన్నాడు. MAA సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయన్నాడు. నరేశ్ కు పనిచేయనీయడం రాదని అన్నాడు. మేం కేవలం ఈసీ మెంబర్స్ అన్న తనీశ్.. ఆయన చేసే పనులను మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పాడు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ అన్నలు అంటే నాకు ఇష్టమని చెప్పాడు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చాడని అన్నాడు. బెనర్జీ అడ్డుకునేందుకు వస్తే.. ఆయన్నూ తిట్టాడన్నాడు. ఆ తర్వాత విషయం తెలిసి విష్ణు, మనోజ్ అన్నలు నన్ను ఓదార్చారన్నాడు. అయినా ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నా అని అన్నాడు. రేపు సమావేశాలు జరిగినప్పుడు ధైర్యం నా వాణి వినిపించలేనని ఆవేదన వ్యక్తం చేశాడు తనీశ్.