నైట్ బజార్​కు కేంద్రంగా ట్యాంక్​బండ్

నైట్ బజార్​కు కేంద్రంగా ట్యాంక్​బండ్
  • రెండేళ్ల కిందటి ప్రతిపాదనలను అమలుచేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు

హైదరాబాద్, వెలుగు: సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా ఉన్న హుస్సేన్ సాగర్ నైట్ బజార్​కు కేంద్రం కానుంది. రెండేళ్ల కిందట రూపొందించిన ప్రతిపాదనలను తొందరలోనే అమలుచేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెడీ అవుతున్నారు.  ఫన్ డే సండే కోసం ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్​బండ్​కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడ మరిన్ని సౌలతులు కల్పించేలా నైట్ బజార్​ను తీసుకురానున్నారు. కరోనా ఎఫెక్ట్​తో నైట్ బజార్ ప్రతిపాదనలు అప్పట్లో నిలిచిపోగా.. హెచ్ఎండీఏ వాటిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది. సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్‌‌‌‌ వరకు హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ వెంబడి నైట్‌‌‌‌ బజార్‌‌‌‌ను డెవలప్ చేయనున్నారు. ఇప్పటికే  ఆ మార్గంలో అమ్యూజ్ మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేస్తే, వీకెండ్ లో ట్యాంక్ బండ్ పైకి వచ్చే సందర్శకులను మరింత ఆకట్టుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.