టాటా పవర్ రిన్యూవబుల్‌లోకి  రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు

టాటా పవర్ రిన్యూవబుల్‌లోకి  రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ:  బ్లాక్‌రాక్‌ రియల్‌‌‌‌ అసెట్స్‌‌‌‌, ముబదాల ఇన్వెస్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీలు టాటా పవర్ సబ్సిడరీ కంపెనీ   టాటా పవర్‌‌‌‌‌‌‌‌ రిన్యూవబుల్ ఎనర్జీలో  రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఈ ఫండ్స్‌‌‌‌తో తమ రిన్యూవబుల్ ఎనర్జీ పోర్టుఫోలియోని మరింత పెంచుకుంటామని టాటా  పవర్‌‌‌‌‌‌‌‌ రిన్యూవబుల్ ప్లాన్స్ వేసుకుంది.‘బ్లాక్‌‌‌‌రాక్‌‌‌‌ రియల్‌‌‌‌ అసెట్స్‌‌‌‌, ముబదాలలు టాటా పవర్‌‌‌‌‌‌‌‌ రిన్యూవబుల్స్‌‌‌‌లో రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నాయి.

దీంతో వీటికి కంపెనీలో 10.53 శాతం వాటా దక్కుతుంది. కంపెనీ ఈక్విటీ వాల్యుయేషన్ రూ. 34 వేల కోట్ల దగ్గర ఈ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్రాసెస్ జరుగుతోంది’ అని టాటా రిన్యూవబుల్ ఎనర్జీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  టాటా పవర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అన్ని రకాల రిన్యూవబుల్ అసెట్స్ టాటా పవర్‌‌‌‌‌‌‌‌ రిన్యూవబుల్ కిందకు వస్తాయి. ఇందులో విండ్‌‌‌‌, హైబ్రిడ్‌‌‌‌, సోలార్ పవర్‌‌‌‌‌‌‌‌ను జనరేట్ చేసే అసెట్స్‌‌‌‌, సోలార్‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌, మాడ్యూల్స్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ వంటివి ఉంటాయి. ప్రస్తుతం టాటా పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ పోర్టుఫోలియోలో 4.9 గిగా వాట్‌‌‌‌ల రిన్యూవబుల్ ఎనర్జీ అసెట్స్ ఉన్నాయి.