జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 25న మల్లాపూర్ మండల కేంద్ర శివారులో విద్యార్థులతో వెళ్తోన్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి వరి పొలంలో బోల్తాపడింది. ఈ ఘటనలో పలురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే గాయాలైన విద్యార్థులను మెట్ పల్లి హాస్పిటల్ కు తరలించారు.
వాల్గొండ గ్రామం నుండి మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రమాదంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు గాయాలు కావడంతో బోరున విలపిస్తున్నారు.
