- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికుల వారసుల ఉద్యోగాలతో ముడిపడి ఉన్న మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం గోదావరిఖనిలోని సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పెద్ద సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20 వేల మందిని, డిస్మిస్ పేరిట 10 వేల మందిని నాటి ప్రభుత్వాలు తొలగించాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కార్మికులను తొలగించే కుట్ర జరుగుతున్నదని అన్నారు.
సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతుందని, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా ఉద్యోగులపైన ఏసీబీ, విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఆందోళనలో ఏరియా వైస్ ప్రెసిడెంట్వడ్డేపల్లి శంకర్, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, చెల్పూరి సతీశ్ , జావిద్ పాషా, శ్రీనివాసరావు, చల్లా రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
